ఈ నెల 3 న చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో.ఎస్ ఎస్ డీ టోకెన్లు.రద్దు
అమరావతి, 01 మార్చి (హి.స.) తిరుపతి(తితిదే), ఈ నెల 3న చంద్రగ్రహణం కారణంగా 2, 3వ తేదీలకు సంబంధించిన శ్రీవారి స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టోకెన్లను రద్దు చేసినట్లు తితిదే శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. అంటే 3కి ముందు 1, 2వ తేదీల్లో తిరుపతిలో టోకెన
ఈ నెల 3 న చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో.ఎస్ ఎస్ డీ టోకెన్లు.రద్దు


అమరావతి, 01 మార్చి (హి.స.)

తిరుపతి(తితిదే), ఈ నెల 3న చంద్రగ్రహణం కారణంగా 2, 3వ తేదీలకు సంబంధించిన శ్రీవారి స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టోకెన్లను రద్దు చేసినట్లు తితిదే శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. అంటే 3కి ముందు 1, 2వ తేదీల్లో తిరుపతిలో టోకెన్లు జారీ చేయరు. తిరిగి 4వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకెన్లను 3న జారీ చేస్తారు. 3న వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేయడంతో 2న ఆ సిఫార్సు లేఖలు స్వీకరించరు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande