
హైదరాబాద్, 01 మార్చి (హి.స.)
తెలంగాణలో మరోసారి ఫార్ములా ఈ కార్ రేస్ అంశం
(Formula E Race) తెరపైకి వస్తోంది. ఈకేసులో ఈసారి సంచలనం నమోదు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ (Arvind Kumar) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ (MAUD) ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన సమయంలో ఈ-కార్ రేస్ వ్యవహారాలలో కీలక పాత్ర పోషించిన అర్వింద్ కుమార్ తాజాగా అప్రూవగా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మరోసారి ప్రచారం తెరపైకి వచ్చింది. దీంతో ఇదే నిజం అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కష్టాలు తప్పవా అనే చర్చ జరుగుతోంది.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అరవింద్ కుమాతో పాటు మరో ముగ్గురి పేర్లు నిందితుల జాబితాలో ఏసీబీ పేర్కొంది. ఈ క్రమంలో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇవ్వగా ఇటీవల అర్వింద్ కుమార్ ప్రాకిక్యూషన్కు కేంద్ర డీఓపీటీ అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ల ట్రాన్స్ ఫర్స్ లో అర్వింద్ కుమాను పక్కన పెట్టింది. ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో అరవింద్ పై త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేసి విచారణ జరపవచ్చనే ప్రచారం జరుగుతోంది. తన విషయంలో పరిస్థితిలు రోజు రోజుకు జఠిలం అయే అవకాశాలు ఉండటంతో ఇక అప్రూవగా మారేందుకు అరవింద్ కుమార్ ఏసీబీ ఉన్నతాధికారులను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..