
మంచిర్యాల, 01 మార్చి (హి.స.)
విద్యార్థులకు హాస్టల్ వార్డెన్
సరిపడా భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆందోళనకు దిగిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని సాయి కుంట ప్రభుత్వ బీసీ సమికృత బాలుర వసతి గృహంలో వార్డెన్ విద్యార్థులకు సరిపడా భోజనం అందించడం లేదని ఆదివారం వసతి గృహం గేటు బయట విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రతిరోజు వార్డెన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా వసతి గృహంలో అపరిశుభ్ర వాతావరణం నెలకొందని దీంతో అనారోగ్యానికి గురవుతున్నామని అన్నారు. వసతి గృహాంలో వార్డెన్ చెప్పిందే వినాలని ఆంక్షలు విధించినట్లు విద్యార్థులు చెబుతున్నారు. కడుపు మార్చుకుని కొన్ని కొన్ని రోజులలో పస్తులు ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని విద్యార్థులు వాపోయారు. హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని లేకపోతే గేటు బయట నుండి హాస్టల్ లోకి వెళ్ళేది లేదంటూ భీష్మించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..