
హైదరాబాద్, 01 మార్చి (హి.స.)
మహిళా సాధికారత దిశగా నగరం సాగిస్తున్న ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. ఆదివారం హైదరాబాద్ లో సేవా భారతి తెలంగాణ 'రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్' 10వ ఎడిషన్ను ఘనంగా నిర్వహించింది. 5కే, 10 కే, 21కే విభాగాలలో జరిగిన ఈ పరుగులో వేలాది మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ 10వ వార్షికోత్సవ పరుగును ముఖ్య అతిథులుగా హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, భారత దిగ్గజ మహిళ క్రికెటర్ మిథాలీ రాజ్ లు పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరి చందన మాట్లాడుతూ.. ఈ 10వ ఎడిషన్ సమాజంలోని అణగారిన వర్గాల బాలికల సాధికారతపై దృష్టి పెట్టడం ద్వారా మనం మరింత బలమైన, సమ్మిళిత దేశాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ ఆశయం కోసం వేలాది మంది హైదరాబాదీలు పరుగెత్తడం చూడటం ఎంతో స్ఫూర్తిదాయకం అని మిథాలీ రాజ్ అన్నారు. ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ వైస్ ప్రెసిడెంట్ పి. చంద్రశేఖర రెడ్డి, గ్లోబల్ డేటా ఎండీ రాహుల్ భాటియా, పాల్టిక్ కో-ఫౌండర్ శాంతి పాల్రెడ్డి, సేవా భారతి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సుమలత,సేవా భారతి తెలంగాణ జాయింట్ సెక్రటరీ జయప్రద దేవి పాల్గొని ప్రసంగించారు. విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి ద్వారా బాలికలకు జీవితాల్లో మార్పు ఈ వేడుక ప్రతిబింబించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు