
నాగపూర్, మహారాష్ట్ర, 01 మార్చి (హి.స.)
మహారాష్ట్రలోని నాగపూర్ లో భారీ విస్పోటనం (Huge explosion) సంభవించి 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ సమీపంలో కటోల్ ఉన్న బాణాసంచా కర్మాగారం (Fireworks factory)లో చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో భవనంలో 30 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో భవనం కుప్పకూలి పోయింది. ఈ సమాచారం అందుకున్న ఫైర్, పోలీస్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 17 మంది మృతి (15 people died) చెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణలతో పూర్తి వివరాలు కాగా ఈ తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..