తమిళనాడులో ప్రధాని మోడీ.. స్టాలిన్ సర్కార్పై కీలక వ్యాఖ్యలు
చెన్నై, 01 మార్చి (హి.స.) ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) స్టాలిన్ ఆదివారం తమిళనాడులో పర్యటించారు. రూ.4 వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ''డీఎంకేను ఇంటికి పంపించాలని త
Modi


చెన్నై, 01 మార్చి (హి.స.)

ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)

స్టాలిన్ ఆదివారం తమిళనాడులో పర్యటించారు. రూ.4 వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. 'డీఎంకేను ఇంటికి పంపించాలని తమిళనాడు ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎన్డీఏతోనే మార్పు సాధ్యమని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం ఖాయం. తమిళనాడు అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నాము. తమిళనాడుకు నిధులు ఇవ్వడం లేదని సీఎం స్టాలిన్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. తాము తమిళనాడు అభివృద్ధికి సంపూర్ణంగా సహకరించాం. నేతృత్వంలో అభివృద్ధి శూన్యం. ప్రస్తుత ప్రభుత్వం స్కామ్లు చేస్తోంది తప్ప.. డెవలప్మెంట్ చేయడం లేదు. తాము అధికారంలోకి వచ్చాక అసలైన అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం. తమిళనాడు చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ఆదిచనల్లూరు వంటి ప్రదేశాలను ప్రపంచ వారసత్వ స్థలాలుగా గుర్తించి అభివృద్ధి చేస్తా' అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. మరక్కనం-పుదుచ్చేరి, పరమకుడి-రామనాథపురం నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ, తమిళనాడులో 8 రైల్వే స్టేషన్ల ఆధునీకీకరణకు మోడీ శంకుస్థాపన చేశారు. చెన్నై బీచ్-చెన్నై ఎగ్మోర్ మధ్య నాల్గో రైల్వే లైన్ను జాతికి అంకితం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande