చిక్కబళ్లాపుర జిల్లాలోని అలీపుర శోకసంద్రంలో మునిగిపోయింది
చిక్కబళ్లాపుర, 01 మార్చి (హి.స.)అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మృతి చెందడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన మద్దతుదారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భారత్లోనూ పలు ప్రాంతాల్లో ఆయన మద్దతుదారులు సంఘీభావంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంల
చిక్కబళ్లాపుర జిల్లాలోని అలీపుర శోకసంద్రంలో మునిగిపోయింది


చిక్కబళ్లాపుర, 01 మార్చి (హి.స.)అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మృతి చెందడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన మద్దతుదారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భారత్లోనూ పలు ప్రాంతాల్లో ఆయన మద్దతుదారులు సంఘీభావంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటకలోని ఓ గ్రామం కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. దాదాపు నలభై ఏళ్ల కిందట ఖమేనీ ఆ గ్రామంలో పర్యటించడమే ఇందుకు కారణం.

చిక్కబళ్లాపుర జిల్లాలోని అలీపుర జనాభా దాదాపు 30 వేలు. వీరిలో ఎక్కువ మంది షియా ముస్లింలు. దీన్ని ‘మినీ ఇరాన్’గా అభివర్ణిస్తుంటారు. 1986లో ఖమేనీ భారత్లో పర్యటించగా.. ఆ సందర్భంలో గ్రామస్థుల ఆహ్వానం మేరకు ఆయన అలీపురను (Khamenei visited Alipura) సందర్శించారు. స్థానిక ప్రజలతోపాటు మత పెద్దలతో ముచ్చటించారు. ఆ తర్వాత ఆయన గౌరవార్థంగా స్థానికంగా ఓ ఆసుపత్రిని నిర్మించారు. ఇలా ఇరాన్తో ఈ గ్రామానికి బలమైన సాంస్కృతిక సంబంధాలు ఏర్పడ్డాయని స్థానికులు పేర్కొన్నారు. అనేక కుటుంబాలు ఉన్నత చదువుల కోసం ఇరాన్ వెళ్లడంతోపాటు కొందరు అక్కడే ఉద్యోగాలు చేస్తూ స్థిరపడినట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande