గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేసి సీమాంధ్రులకు బెట్టింది.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి
నల్గొండ, 01 మార్చి (హి.స.) గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేసి కాంట్రాక్టు పేరుతో సీమాంధ్రలకు దోచిపెట్టిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం మునుగోడు మండల కేంద్రంలో 200 కోట్ల వ్యయంతో మంజూరైన యంగ్ ఇండియా ఇ
MLA


నల్గొండ, 01 మార్చి (హి.స.)

గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేసి కాంట్రాక్టు పేరుతో సీమాంధ్రలకు దోచిపెట్టిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం మునుగోడు మండల కేంద్రంలో 200 కోట్ల వ్యయంతో మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం బర్లు, గొర్లు, చేపలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను కట్టిస్తుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల పిల్లలు కులాలకతీతంగా అందరూ విద్యార్థులు ఒకే పాఠశాలలో చదువుకునే విధంగా 20వేల కోట్ల రూపాయలతో 79 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను మంజూరు చేసి కట్టిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిస్ చార్జీలు 40 శాతానికి పెంచారన్నారు. తెలంగాణలో ఉచిత వైద్య, విద్యం అందించాలని బాధ్యతతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. పది సంవత్సరాలలో గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికి వదిలేసింది అన్నారు. రెండు సంవత్సరాలలోగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం 10 నుంచి 15% విద్యా వ్యవస్థకు ఖర్చు చేసి సమూలమైన మార్పు తీసుకురావాలన్నారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికి వదిలేసింది హైదరాబాదుకు కూతవేటు దూరంలో ఉన్న మునుగోడు అన్ని రంగాలలో వెనుకబడి ఉందని మునుగోడు అభివృద్ధి చేసేందుకే మొదటి అడుగుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను తీసుకొచ్చామన్నారు. నల్లగొండ జిల్లా అంటే టైగర్ జోన్ అని నిరంకుశ కు వ్యతిరేకంగా పోరాడిన నల్లగొండ జిల్లా విప్లవాల జిల్లా అన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను నల్గొండ జిల్లా శాసిస్తుందన్నారు. మునుగోడును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande