
చెన్నై:, 01 మార్చి (హి.స.)పుదుచ్చేరి, మదురై పర్యటనల నిమిత్తం చెన్నై విచ్చేసిన ప్రధాని మోదీకి ఆదివారం నగరంలో వీడ్కోలు పలికారు. పుదుచ్చేరి, మదురైలలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం రాత్రి ప్రధాని మోదీ చెన్నై చేరుకుని లోక్ భవన్లో బస చేశారు. ఆదివారం ఉదయం పుదుచ్చేరి బయలుదేరిన ఆయనకు చెన్నై విమానాశ్రయంలో రాష్ట్ర పర్యాటకం శాఖ మంత్రి తంగం తెన్నరసు వీడ్కోలు పలికారు. వారి వెంట చెన్నై మహానగర పాలకసంస్థ మేయర్ ప్రియ ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ