
నాగర్ కర్నూల్, 01 మార్చి (హి.స.) నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామం జాతరలో జరిగిన పరస్పర దాడులు, చిన్నారి మృతి ఘటనలకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, ఈర్లపల్లి శంకర్ శనివారం రాత్రి డిజిపి శివశంకర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సంఘటనలు జరగడం దురదృష్టకరం. ఈ సంఘటనలు జరగడానికి దారి తీసిన పరిస్థితుల పై లోతుగా విచారణ జరపండి. ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా మేము పూర్తిగా సహకరిస్తాము. దోషులు ఏ స్థాయి వారు అయినా, ఏ పార్టీ వారు అయిన సరే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ, ఎమ్మెల్యేలు డిజిపికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈ విషయం పై ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. పూర్తిస్థాయి విచారణ జరిపించి నిజా నిజాలు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు