మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’
పౌరసేవలను సులభతరం చేయడంపై జయేశ్రంజన్ ఆధ్యర్యంలో ఏకసభ్య కమిటీ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి
Revanth reddy


హైదరాబాద్, 01 మార్చి (హి.స.)ప్రజలు కోరుకున్న మార్పును స్వాగతిస్తున్నందునే వరుస ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని, వారికి మరింత మంచి చేసేందుకు ముందుకు సాగుతూ తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజలకు కోరుకున్న మార్పును అందిస్తామనే హామీతోనే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల మూడు నెలలైందని చెప్పారు. ఇప్పటివరకు సాధించిన విజయాలను నిజాయతీగా అంచనా వేసుకుని, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో గుర్తించాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. మిగిలిన రెండేళ్ల తొమ్మిది నెలల పరిపాలన కాలంలో చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీపీజీ శివధర్రెడ్డితోపాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం చేపడుతున్నాం. గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు ఈ ప్రణాళికను అమలు చేయాలి. ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ పురోగతిని వ్యక్తిగతంగా నేనే రోజూ పరిశీలిస్తాను. క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తాను. అధికారుల పనితీరులో లోపాలను సహించను.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande