
జమ్మూ 01 మార్చి (హి.స.)
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణ వార్తలతో ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. భారత్లోని జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లోనూ ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన కశ్మీర్ సర్కార్ రెండ్రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. మరోవైపు.. ఖమేనీ మృతిపై హైదరాబాద్ ఓల్డ్ సిటీలో నిరసనలు వెల్లువెత్తాయి. ఓల్డ్ సిటిలోని పురాని హవేలీలో తంజీమ్ ఈ జాఫెరీ సంస్థ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇజ్రాయెల్ ముర్దాబాద్, నేతన్యాహు మూర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు ముస్లింలు. భారీ సంఖ్యలో ముస్లిం మత పెద్దలు.. స్థానికులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ర్యాలీ సమయంలో ఓల్డ్ సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ఇరాన్ మీడియా అధికారికంగా ధృవీకరించింది. ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మరణించినట్లు తెలిపాయి.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు