నిన్నటి రికార్డు బ్రేక్... చరిత్రలోనే అత్యధిక గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదు
హైదరాబాద్, 01 మార్చి (హి.స.) వేసవి ప్రారంభంలోనే రాష్ట్రంలో విద్యుత్ వినియోగంలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. టీజీఎన్పీడీసీఎల్ (TGNPDCL) చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా శనివారం గరిష్ట విద్యుత్ డమాండ్ 6,057 మెగావాట్లు నమోదు కాగా ఆదివారానిక
Electricity


హైదరాబాద్, 01 మార్చి (హి.స.)

వేసవి ప్రారంభంలోనే రాష్ట్రంలో విద్యుత్ వినియోగంలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. టీజీఎన్పీడీసీఎల్ (TGNPDCL) చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా శనివారం గరిష్ట విద్యుత్ డమాండ్ 6,057 మెగావాట్లు నమోదు కాగా ఆదివారానికి ఆ రికార్డు చెరిగిపోయింది. తాజాగా ఇవాళ చరిత్రలోనే అత్యధిక గరిష్ట విద్యుత్ డిమాండ్ 6,267 మెగావాట్లు నమోదైనట్లు సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి (CMD Varun Reddy) తెలిపారు. దీంతో నిన్న నమోదైన హై పీక్ డిమాండ్ కొన్ని గంటల వ్యవధిలోనే అధిగమించిపోయింది. ఈ పరిణామం ఎన్పీడీసీఎల్ చరిత్రలో మైలురాయిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఇది సంస్థ ముందస్తుగా తీసుకున్న ప్రణాళికాబద్ధమైన చర్యల ఫలితమని స్పష్టం చేశారు.

రోజురోజుకు ఎండలు పెరుగుతుండటంతో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోందని తెలిపారు. అయినప్పటికీ, ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. డిమాండ్ ఎంత పెరిగినా సరఫరాలో అంతరాయం రాకుండా విద్యుత్ అందించేందుకు సంస్థ పూర్తిగా సమాయత్తమై ఉందని సీఎండీ పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఉన్నతాధికారుల పర్యవేక్షణ, దిశానిర్దేశంతో వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. వచ్చే వేసవిలో డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, అందుకు సంస్థ పూర్తిగా సిద్ధంగా ఉందని,ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా చర్యలు తీసుకుంటున్నామని సీఎండీ వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande