తెలంగాణలో మొదలైన భానుడి ప్రతాపం.. మార్చి 3 నుంచి ఎండలు తీవ్రం!
హైదరాబాద్, 01 మార్చి (హి.స.) చలికాలం ఇలా ముగిసిందో లేదో ఎండ తీవ్రత (Sun intensity) భారీగా పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న క్రమంలో వెదర్మ్యాన్ (Weatherman) కీలక అలర్ట్ జారీ చేశారు. మార్చి నెల ప్రారం
Weather


హైదరాబాద్, 01 మార్చి (హి.స.)

చలికాలం ఇలా ముగిసిందో లేదో ఎండ

తీవ్రత (Sun intensity) భారీగా పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న క్రమంలో వెదర్మ్యాన్ (Weatherman) కీలక అలర్ట్ జారీ చేశారు. మార్చి నెల ప్రారంభం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని తెలంగాణ వెదర్మ్యాన్ (Telangana Weatherman) వెల్లడించారు. ముఖ్యంగా మార్చి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉష్ణోగ్రతలలో భారీ పెరుగుదల కనిపిస్తుందని, పగటి పూట ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.

వేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలు అయిన భద్రాద్రి, ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 39°C నుండి 41°C వరకు నమోదు కావొచ్చని అంచనా వేశారు. అలాగే హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు 36°C నుంచి 37°C వరకు చేరుకునే అవకాశం ఉంది. అలాగే మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత 37°C నుంచి 39°C వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వేసవి కాలం అధికారికంగా ప్రారంభమైనందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగినంత నీరు తాగుతూ శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలని వెదర్మ్యాన్ సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande