
హైదరాబాద్, 01 మార్చి (హి.స.) అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్
సంయుక్తంగా ఇరాన్ పై భారీ దాడికి చేసింది. యుద్ధ విమానాలతో (fighter jets) విరుచుకు పడగా.. ఇరాన్ కూడా తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఎనిమిది దేశాల్లోని అమెరికా యుద్ధ స్థావరాలపై దాడులు చేసింది. ఇదిలా ఉంటే అమెరికా, ఇజ్రాయెల్ (America, Israel) జరిగిన క్షిపణుల ప్రయోగంలో ఇరాన్ చీఫ్ ఖమేని (Iran's Supreme Leader Khamenei) తో పాటు ఆయన కుమార్తె, మనవరాలు ప్రాణాలు కోల్పోయారు. అలాగే వందల సంఖ్యలో సామాన్య ప్రజలు కూడా ఈ యుద్ధంలో ప్రాణాలు విడిచారు. ఇరు దేశాల పరస్పర దాడులతో ఆయా దేశాల్లో ఉన్న ప్రజలతో పాటు వలస కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని క్షణాలను చక్కబెట్టుకుంటున్నారు.
మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య నెలకొన్న ఈ సైనిక చర్యల పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (United Nations Security Council) అత్యవసరంగా సమావేశమైంది. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఈ సైనిక చర్యలను తీవ్రంగా ఖండించారు. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులు అంతర్జాతీయ చట్టాలను, UN చార్టర్ను ఉల్లంఘించడమేనని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో, ఈ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ పక్కనే ఉన్న గల్ఫ్ దేశాలపై (బహ్రెయిన్, ఇరాక్, సౌదీ అరేబియా మొదలైనవి) జరిపిన ప్రతీకార దాడులను కూడా ఆయన తప్పుబట్టారు. ఈ ఉద్రిక్తతలు ప్రపంచ శాంతికి పెను ముప్పుగా పరిణమిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..