
విజయవాడ 01 మార్చి (హి.స.)
బస్టేషన్, ఆర్టీసీ బస్సు డ్రైవర్పై ఆటో డ్రైవర్లు దౌర్జన్యం చేసిన ఘటన శనివారం సిటీ బస్ పోర్ట్ వద్ద చోటు చేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం ఆటోనగర్ నుంచి జక్కంపూడి కాలనీ వెళ్తున్న సిటీ బస్సు.. బస్ పోర్ట్ నుంచి బయటకు వచ్చే సమయంలో అడ్డదిడ్డంగా మలుపు తిరుగుతున్న ఆటోకు బస్సు రాసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన స్థానిక ఆటో చోదకులు బస్సు డ్రైవరు, కండక్టర్లపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో సిటీ బస్పోర్ట్లో గంటకు పైగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం డ్రైవర్ ఫిర్యాదు చేసేందుకు కృష్ణలంక పోలీస్స్టేషన్కు చేరుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ