మోదీ ఇజ్రాయెల్ పర్యటన సిగ్గుచేటు : కాంగ్రెస్
దిల్లీ:, 01 మార్చి (హి.స.)ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఇజ్రాయెల్లో పర్యటించడాన్ని కాంగ్రెస్ పార్టీ సందర్భ ఔచిత్యం లేని చర్యగా అభివర్ణించింది. ప్రధాని పర్యటన పశ్చిమాసియాలో ఉద్రిక్తతల పెరుగుదలకు భారత్ మద్దతు తెలుపుతోందన్న భావన కలిగిస్తోందని, ఇది స
మోదీ ఇజ్రాయెల్ పర్యటన సిగ్గుచేటు : కాంగ్రెస్


దిల్లీ:, 01 మార్చి (హి.స.)ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఇజ్రాయెల్లో పర్యటించడాన్ని కాంగ్రెస్ పార్టీ సందర్భ ఔచిత్యం లేని చర్యగా అభివర్ణించింది. ప్రధాని పర్యటన పశ్చిమాసియాలో ఉద్రిక్తతల పెరుగుదలకు భారత్ మద్దతు తెలుపుతోందన్న భావన కలిగిస్తోందని, ఇది సిగ్గుచేటని ఆ పార్టీ విదేశీ వ్యవహారాల ఛైర్మన్ సల్మాన్ ఖుర్షీద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడికి పాల్పడటాన్ని కాంగ్రెస్ పార్టీ శనివారం ఖండించింది. భారత ప్రభుత్వం ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతల్ని నిర్మూలించేందుకు కృషి చేసి పశ్చిమాసియాలో ఉన్న భారతీయులందరినీ సురక్షితంగా స్వదేశానికి రప్పించే ప్రయత్నం చేయాలని ఆ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీ డిమాండ్ చేశారు. ఇరాన్లో, ఇతర పశ్చిమాసియా దేశాల్లో నివాసం ఉంటున్న భారతీయుల భద్రతపై తమకు ఆందోళన కలుగుతోందని సోషల్ మీడియా పోస్టులో వారు పేర్కొన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande