ఇరాన్ అబద్ధపు ప్రచారానికి Alని వాడుతోంది: డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ, 16 మార్చి (హి.స.) ఇరాన్ దేశం తన సైనిక బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి మీడియా మానిప్యులేషన్, కృత్రిమ మేధ (AI)2 ఒక ఆయుధంగా వాడుకుంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విమర్శించారు. ఇరాన్ సైన్యం క్షేత్రస్థాయిలో దెబ్బతి
Trump


న్యూఢిల్లీ, 16 మార్చి (హి.స.)

ఇరాన్ దేశం తన సైనిక బలహీనతను

కప్పిపుచ్చుకోవడానికి మీడియా మానిప్యులేషన్, కృత్రిమ మేధ (AI)2 ఒక ఆయుధంగా వాడుకుంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విమర్శించారు. ఇరాన్ సైన్యం క్షేత్రస్థాయిలో దెబ్బతింటున్నప్పటికీ, తప్పుడు సమాచారాన్ని సృష్టించడంలో మాత్రం ఆరితేరిందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా సముద్రంలో అమెరికా నౌకలపై దాడులు చేస్తున్నట్టు చూపిస్తున్న కామికేజ్ బోట్లు అసలు ఉనికిలోనే లేవని, అవన్నీ కేవలం ప్రపంచాన్ని నమ్మించడానికి సృష్టించిన భ్రమలని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అమెరికాకు చెందిన విమానాలు, నౌకలు ధ్వంసమయ్యాయని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అమెరికా రక్షణ వ్యవస్థలు సురక్షితంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక యుద్ధనౌక 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్' సముద్రంలో మంటల్లో చిక్కుకున్నట్లు వస్తున్న దృశ్యాలు కేవలం AI సృష్టించిన ఫేక్ న్యూస్ అని ట్రంప్ మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై 'దేశద్రోహం' కింద చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) చైర్మన్ బ్రెండన్ కార్ ఇప్పటికే కొన్ని మీడియా సంస్థల లైసెన్స్లను సమీక్షించే పనిలో ఉన్నారని ఆయన వెల్లడించారు. ప్రజల సొమ్ముతో నడిచే ఎయిర్ వేవ్ను వాడుకుంటూ దేశానికి వ్యతిరేకంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలకు గట్టి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ట్రంప్ తన పోస్ట్లో పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande