దక్షిణ కొరియాకు షాక్.. 10 క్షిపణులు పరీక్షించిన ఉత్తర కొరియా..
న్యూఢిల్లీ, 14 మార్చి (హి.స.) ఉత్తర కొరియా(North Korea) ఇవాళ తూర్పు జలాల్లోకి 10 బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించినట్లు దక్షిణకొరియా వెల్లడించింది. అమెరికాతో దక్షణికొరియా సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొన్న నేపథ్యంలో ఉత్తర కొరియా తాజాగా క్షిప
North Korea


న్యూఢిల్లీ, 14 మార్చి (హి.స.)

ఉత్తర కొరియా(North Korea) ఇవాళ తూర్పు జలాల్లోకి 10 బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించినట్లు దక్షిణకొరియా వెల్లడించింది. అమెరికాతో దక్షణికొరియా సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొన్న నేపథ్యంలో ఉత్తర కొరియా తాజాగా క్షిపణి పరీక్షకు పూనుకున్నది. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ సమీపం నుంచి ఆ క్షిపణులను ఫైర్ చేసినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. అయితే ఆ క్షిపణులు ఎంత దూరం ప్రయానించాయో తెలియదు. ఎనకామిక్ జోన్ సమీపంలో ఆ క్షిపణులు పడినట్లు జపాన్ రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఉత్తర కొరియా నిర్వహించిన క్షిపణి పరీక్షల సమాచారాన్ని జపాన్, అమెరికాతో ఎప్పటికప్పుడు పంచుకున్నట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. ఉత్తర కొరియా పరీక్షించిన క్షిపణులు సుమారు 340 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు జపాన్ రక్షణ శాఖ వెల్లడించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande