
అమరావతి, 02 మార్చి (హి.స.), రాష్ట్రంలోని 37 కరువు మండలాల్లో అదనపు ఉపాధి పనిదినాలు కల్పిస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం శ్రీసత్యసాయి జిల్లాలో 25 మండలాలు, అన్నమయ్య జిల్లాలో 9, ప్రకాశం జిల్లాలో మూడింటిని ఇప్పటికే కరువు మండలాలుగా ప్రకటించింది. ఈ మండలాలకు మరో 50 పనిదినాలు అదనంగా కల్పించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం ఆమోదించడంతో ఈ 37 మండలాల్లో ఒక్కో కుటుంబానికి అదనంగా 50 పనిదినాలు కల్పిస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలిచ్చింది. మార్చి 31లోపు ఈ పనిదినాలు వాడుకోవలసి ఉంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ