
రేపల్లె , , 02 మార్చి (హి.స.)
: సాంకేతికతపై పట్టు ఉంటే ఆధార్ కార్డు డౌన్లోడ్, వివరాల మార్పులు చేర్పుల కోసం ఆధార్ కేంద్రాలు, నెట్ సెంటర్ల చుట్టూ తిరిగి వ్యయ ప్రయాసలకు లోను కావాల్సిన అవసరం ఉండదు. అండ్రాయిడ్ ఫోను ఉంటే చాలు. క్షణాల్లో ఈ పనులన్నీ మీరే స్వయంగా చేసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్లి ఆధార్ అని టైప్ చేయగానే యాప్ కనిపిస్తుంది. డౌన్లోడ్ పూర్తికాగానే ఆధార్ వివరాలు నమోదు చేసి ఓటీపీ, ముఖ నిర్ధారణ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం ఫొటోతో కూడిన ఆధార్ కార్డు కనిపిస్తుంది. కింద డౌన్లోడ్, షేర్, బయోమెట్రిక్ లాక్ వంటి ఐచ్ఛికాలు కనిపిస్తాయి. వీటి ద్వారా కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇతరులకు పంపొచ్చు. సర్వీసు పేజీ తెరవగానే చరవాణి నంబరు, అప్డేట్, అడ్రస్ అప్డేట్ ఐచ్ఛికాలు కనిపిస్తాయి. వీటిని ఎంపిక చేసుకుని మార్పులు, చేర్పులను ముఖఆధారిత నిర్ధారణ ద్వారా క్షణాల్లో పూర్తి చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులవీ నవీకరించుకోవచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ