సీఎం.పైనే డీఎస్పీ.ఫిర్యాదు
తుళ్లూరు,, 02 మార్చి (హి.స.) ఆయన డీఎస్పీ స్థాయి పోలీసు అధికారి..! పేరు దేవరకొండ నాగవరప్రసాద్. ప్రస్తుతం మెడికల్ లీవ్లో ఉన్న ఆయన... తిరుమల లడ్డూ కల్తీ విషయంలో ఇటీవల జరుగుతున్న చర్చతో భక్తుల మనోభావాలు, విశ్వాసాలు దెబ్బతిన్నాయంటూ బాధపడిపోయారు! ప్రభుత
సీఎం.పైనే డీఎస్పీ.ఫిర్యాదు


తుళ్లూరు,, 02 మార్చి (హి.స.)

ఆయన డీఎస్పీ స్థాయి పోలీసు అధికారి..! పేరు దేవరకొండ నాగవరప్రసాద్. ప్రస్తుతం మెడికల్ లీవ్లో ఉన్న ఆయన... తిరుమల లడ్డూ కల్తీ విషయంలో ఇటీవల జరుగుతున్న చర్చతో భక్తుల మనోభావాలు, విశ్వాసాలు దెబ్బతిన్నాయంటూ బాధపడిపోయారు! ప్రభుత్వం కూడా దీనిపై మాట్లాడడం, డిబేట్లు నిర్వహించడం ఆయనకు నచ్చలేదట. అందుకని ఏకంగా సీఎం చంద్రబాబుపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, ఈనాడు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహాన్యూస్ మీడియా చానెళ్లు, టీటీడీ మాజీ ఈవో శ్యామలరావు, చైర్మన్ బీఆర్ నాయుడుపైనా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. తాను గతంలో శ్రీకాకుళం జిల్లాలో డీటీసీగా పనిచేశానని, తర్వాత అనంతపురం జిల్లాలో పీటీసీగా పోస్టు ఇవ్వగా, అక్కడకు వెళ్లడం ఇష్టలేదని మీడియాకు వివరించారు. వలంటరీ రిటైర్మెంట్కు దరఖాస్తు చేసుకున్నానని, ప్రస్తుతం మెడికల్ లీవ్లో ఉన్నట్టు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande