నెల్లూరు ప్రభుత్వ జనరల్. ఆసుపత్రిలోని పిల్లల ఇంటెన్సివ్ వార్డులో అగ్నిప్రమాదం
అమరావతి, 02 మార్చి (హి.స.) నెల్లూరు (వైద్యం):నెల్లూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లోని చిన్నపిల్లల ఇంటెన్సివ్ వార్డులో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పొగలు దట్టంగా వ్యాపించాయి. దీంతో రోగులు, రోగుల సహాయకులతో పాటు కొందరు వైద్య సిబ
నెల్లూరు ప్రభుత్వ జనరల్. ఆసుపత్రిలోని పిల్లల ఇంటెన్సివ్ వార్డులో అగ్నిప్రమాదం


అమరావతి, 02 మార్చి (హి.స.)

నెల్లూరు (వైద్యం):నెల్లూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లోని చిన్నపిల్లల ఇంటెన్సివ్ వార్డులో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పొగలు దట్టంగా వ్యాపించాయి. దీంతో రోగులు, రోగుల సహాయకులతో పాటు కొందరు వైద్య సిబ్బంది కూడా బయటికి పరుగులు తీశారు. అగ్నిమాపక వాహనాలు వచ్చేటప్పటికే వైద్య సిబ్బంది మంటలాపివేయటంతో అంతా పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ సంఘటనపై పురపాలక శాఖమంత్రి పొంగూరు నారాయణ ఆరా తీశారు. పరిస్థితిని చక్కదిద్దాలని ఆదేశించారు.

సాయంత్రం 6 గంటలకు చిన్నపిల్లల ఇన్టెన్సివ్ వార్డులోని ఏసీలో షార్ట్సర్క్యూట్ జరిగింది. ఆ సమయంలో 15 మంది పిల్లలతోపాటు, తల్లులు, ఇతర సహాయకులు మొత్తం 35 మంది ఉన్నారు. ఏసీలో మంటలు రాగా, అవి రెండు పడకలకు వ్యాపించి కాలిపోయాయి. ఆ పడకలలో చిన్నారులెవరూ లేక పోవటంతో ప్రాణాపాయం తప్పింది. డ్యూటీలో ఉన్న వైద్యురాలు అద్దాలను పగులగొట్టి, గట్టిగా అరుస్తూ హెచ్చరికలు చేయడంతో వైద్య సిబ్బంది కరెంటు ఆపేశారు. అక్కడే ఉన్న ఫైర్ సేప్టీ పరికరాలతో మంటలను ఆర్పేశారు. ముందు జాగ్రత్తగా పక్క వార్డులోని మరో 30 మంది పిల్లలు, వారి సహాయకులను వేరే వార్డుకు తరలించారు. ప్రమాదం నుంచి బయట పడటంతో రోగులు, సహాయకులు ఊపిరిపీల్చుకున్నారు. కలెక్టర్ హిమాన్సు శుక్లా ఆదేశాలతో ఎస్పీ అజిత వేజెండ్ల ఆస్పత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి కూడా ఆస్పత్రిని సందర్శించారు. వెంటనే మంటలను ఆపివేసిన వైద్య సిబ్బందిని అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande