
చింతపల్లి, 02 మార్చి (హి.స.)
,:మండలంలోని తాజంగి పంచాయతీ కేంద్రం బీటాలైన్లో గల రాధాకృష్ణుల ఆలయం హోలీ జాతరకు( ముస్తాబయింది. ఆదివాసీలు ప్రతీ ఏడాది హోలీకి ముందు రోజు నుంచి స్థానిక రాధాకృష్ణుల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. హోలీని పురస్కరించుకుని సంప్రదాయంగా భక్తులు ఆలయం ఎదుట 70 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన కర్రల పోగును మంగళవారం కాలుస్తారు. ఆ వేడుకలో రాధాకృష్ణుల ఆలయం స్వయంగా పాల్గొనేందుకు పలు గిరిజన గ్రామాలు, మైదాన ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ