దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఇక ఉచిత ప్రయాణం..
హైదరాబాద్, 02 మార్చి (హి.స.) దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద (Maha Lakshmi Scheme) మహిళలకు ఉచి
Good news


హైదరాబాద్, 02 మార్చి (హి.స.)

దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద (Maha Lakshmi Scheme) మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఇప్పటికే అమలు చేస్తుండగా తాజాగా రాష్ట్రంలోని దివ్యాంగ పురుషులకూ వంద శాతం ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. కాగా ప్రస్తుతం ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు వర్తింప చేస్తున్నారు. వీరు రాష్ట్రంలోని పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో తెలంగాణ సరిహద్దుల లోపు ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. అంతర్రాష్ట్ర (Inter-state) పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులలో తెలంగాణ సరిహద్దు వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే తాజాగా దివ్యాంగులకు సైతం ఈ స్కీమ్ అమలు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande