
హైదరాబాద్, 02 మార్చి (హి.స.)
ఇజ్రాయెల్ గుండెకాయ వంటి
జెరూసలేం నగరంపై ఇరాన్ మిసైల్స్ తో విరుచుకు పడుతోంది. ఇరాన్ జరిపిన ఈ క్షిపణి దాడులు మధ్యప్రాచ్య యుద్ధాన్ని అత్యంత భీకరమైన స్థాయికి తీసుకువెళ్లాయి. ఇరాన్ ఏకకాలంలో వందలాది బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ మీదికి ప్రయోగించగా, అందులో కొన్ని జెరూసలేం నగరంలో పడ్డాయి. ముఖ్యంగా జెరూసలేంకు పశ్చిమ దిశలో ఉన్న బీట్ షెమేష్ (Beit Shemesh) ప్రాంతంలో ఒక క్షిపణి నేరుగా ఒక నివాస భవనాన్ని ఢీకొట్టింది. ఈ భయంకరమైన పేలుడు ధాటికి ఇప్పటివరకు 8 మంది ప్రాణాలు కోల్పోగా, 27 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారని స్థానిక సహాయక బృందాలు వెల్లడించాయి. నగరం అంతటా ఎయిర్-రైడ్ సైరన్లు మోగుతుండటంతో వేలాది మంది ప్రజలు భయాందోళనలతో బంకర్ల వైపు పరుగులు తీశారు.
అయితే ఈ దాడి కేవలం ప్రాణనష్టానికే పరిమితం కాకుండా, మతపరమైన ఉద్రిక్తతలకు కూడా దారితీసింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి శకలాలు పాత జెరూసలేం నగరంలోని అత్యంత పవిత్రమైన 'టెంపుల్ మౌంట్', 'అల్-అక్సా మసీదు'కు అతి సమీపంలో పడ్డాయి. ఇజ్రాయెల్ యొక్క అత్యాధునిక రక్షణ వ్యవస్థలైన 'ఆరో' (Arrow), 'డేవిడ్స్ స్లింగ్' (David's Sling) ద్వారా అనేక క్షిపణులను గాలిలోనే అడ్డుకున్నప్పటికీ, కొన్ని క్షిపణుల శకలాలు నగరంపై పడి భారీ విధ్వంసం సృష్టించాయి. పవిత్ర నగరమైన జెరూసలేంను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇరాన్ తన శక్తిని చాటుకోవాలని చూస్తోంది. జెరూసలేం వంటి చారిత్రాత్మక, పవిత్ర నగరంపై దాడులు జరగడం చూస్తుంటే, యుద్ధం ఇకపై ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా సాగే అవకాశం ఉందని
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..