
హైదరాబాద్, 02 మార్చి (హి.స.)
అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ప్రతి దాడులను మిడిల్ ఈస్ట్ కంట్రీస్ (Middle East Countries) పై జరుపుతోంది. ఇందులు భాగంగా అరబ్ కంట్రీలపై కూడా ఇరాన్ దాడులు చేస్తోంది. దీంతో అయా దేశాలు తమ గగనతలాలను మూసివేయడంతో పాటు విమాన సర్వీసులను నిలిపివేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) గత ఐదు రోజుల క్రితం దుబాయ్ వెళ్లగా యుద్ధం కారణంగా అక్కడే చిక్కుకుపోయినట్లు తెలుస్తుంది. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరికి అకస్మాత్తుగా అనారోగ్యం కలగడంతో, మెరుగైన వైద్య చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్కు వెళ్లినట్లు సమాచారం. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చడం ఆయన ప్రయాణానికి ఆటంకంగా మారింది.
విమానాశ్రయంపై దాడులు విమానాల రద్దు..
ఇరాన్- అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడుల ప్రభావం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై(Dubai International Airport) పడింది. ఆదివారం అర్థరాత్రి దుబాయ్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్-3 సమీపంలో క్షిపణి/డ్రోన్ దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. భద్రతా కారణాల దృష్ట్యా అక్కడి ప్రభుత్వం విమాన రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. దీంతో వేలాది మంది ప్రయాణికులతో పాటు మంత్రి తుమ్మల కూడా అక్కడే చిక్కుకుపోయారు. ఎమిరేట్స్ సహా భారతీయ విమాన సంస్థలైన ఎయిర్ ఇండియా, ఇండిగో కూడా తమ సర్వీసులను రద్దు చేశాయి.
సురక్షితంగా ఉన్న మంత్రి..
ప్రస్తుతం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వారి కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే, దుబాయ్ గగనతలం తిరిగి తెరుచుకొని, విమానాశ్రయ అధికారులు క్లియరెన్స్ ఇచ్చేంత వరకు వారు ఇండియాకు వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం అధికారులతో తెలంగాణ ప్రభుత్వ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుండగా దీనిపై (Telangana Govt) తెలంగాణ ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు