
నల్గొండ, 02 మార్చి (హి.స.)
స్కూల్ బస్సు ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చందనపల్లిలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు స్కూల్ బస్సు విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకు వెళుతోంది. అదే సమయంలో నార్కెట్ పల్లి మండలం నక్కలపల్లికి చెందిన ఇద్దరు బావ బామ్మర్ది బైక్ పై నకిరేకల్ వైపు వెళుతున్నారు. చందనపల్లి వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన స్కూల్ బస్సు, బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. స్థానికుల సమాచారంతో రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు