
ముంబై, 02 మార్చి (హి.స.)
బంగారం ధరలు భారీగా తగ్గుముఖం అయ్యాయి. రెండు రోజులుగా ధరలు పెరుగుతుండగా.. ఒక్కసారిగా దానికి బ్రేక్ పడింది. సోమవారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో కొనుగోలుదారులు కాస్త ఊరట చెందుతున్నారు. అయితే అంతర్జాతీయంగా ఉద్రిక్తలు కొనసాగుతుండటంతో గోల్డ్ రేట్లు ఎప్పుడైనా పెరగొచ్చు.
బంగారం ధరలపై సీన్ రివర్స్ అయింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దంతో తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు ఏర్పడటంతో రెండు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. కానీ ఒక్కసారిగా ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ పరిణామంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. పసిడి ధరలు కుప్పకూలడంతో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
సోమవారం బంగారం ధరలు రూ.3,290 తగ్గాయి. ఈ తగ్గింపు తర్వాత ప్రస్తుతం హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.1,69,800కి పడిపోయింది. నిన్న ఈ రేటు రూ.1,73,090 వద్ద స్థిరపడింది. ఆదివారంతో పోలిస్తే రూ.3,290క డౌన్ అయింది. ఇక 22 క్యారెట్ల ధర రూ. 1,55,650కి తగ్గిపోయింది. నిన్న రూ.1,58,650కి కుప్పకూలింది. నిన్నటితో పోలిస్తే రూ.3 వేలు తగ్గింది.
ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా పై ధరలే కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,70,840గా ఉంది. ఆదివారం ఈ ధర రూ.1,72,090గా ఉండేది. నిన్నటితో చూసుకుంటే చెన్నైలో రూ.1250 మాత్రమే తగ్గింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,56,600గా ప్రస్తుతం కొనసాగుతోంగా.. నిన్న రూ.1,57,750 వద్ద స్థిరపడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV