గోల్డ్లవర్స్ కి బీభత్సమైన గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం,వెండి ధరలు..ఇవాళ్టి రేట్స్ చూస్తే గంతులే!
ముంబై, 21 మార్చి (హి.స.) గత కొన్ని రోజులుగా చుక్కలనంటుతున్న పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. మార్చి 21, 2026న నమోదైన ఈ ధరల తగ్గుదల గత ఏడాది కాలంలోనే అతిపెద్దదిగా నిల
Gold


ముంబై, 21 మార్చి (హి.స.)

గత కొన్ని రోజులుగా చుక్కలనంటుతున్న పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. మార్చి 21, 2026న నమోదైన ఈ ధరల తగ్గుదల గత ఏడాది కాలంలోనే అతిపెద్దదిగా నిలిచింది. గత కొంతకాలంగా రికార్డు స్థాయిలకు చేరుకున్న ధరలు ఒక్కసారిగా దిగిరావడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిచ్చింది.

దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకున్న కఠిన నిర్ణయాల కారణంగా పసిడి ధరలు కుప్పకూలాయి. గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు..

హైదరాబాద్లో నేటి ధరలు (మార్చి 21, 2026):

24 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర రూ.1,48,900 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం: 10గ్రాముల ధర రూ. 1,36,540లకు పడిపోయింది.

వెండి ధరల పతనం:

బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. భారతదేశం – నేటి వెండి ధర గ్రాము రూ.259.90లు ఉండగా, అదే వెండి కిలో రూ.2,59,900లకు చేరింది.

హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం…

– చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,190 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,39,510 గా ఉంది.

– ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,48,900, 22 క్యారెట్ల ధర రూ.1,36,540 గా ఉంది.

– ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,050 క్యారెట్ల ధర రూ.1,36,690 గా ఉంది.

– కోల్కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,48,900, 22 క్యారెట్ల ధర రూ.1,36,540 గా ఉంది.

– బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,48,900, 22 క్యారెట్ల ధర రూ.1,47,690 గా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande