స్టాక్ మార్కెట్లో 'బుల్' జోరు.. నిన్నటి నష్టాల నుంచి కోలుకున్న సూచీలు
హైదరాబాద్, 20 మార్చి (హి.స.) అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ముడి చమురు ధరలు తగ్గడంతో భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. గురువారం సుమారు 2,400 పాయింట్లకు పైగా కుప్పకూలిన సెన్సెక్స్, నేడు ఇన్వెస్టర్ల కొనుగ
స్టాక్ మార్కెట్


హైదరాబాద్, 20 మార్చి (హి.స.)

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన

సానుకూల సంకేతాలు, ముడి చమురు ధరలు తగ్గడంతో భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. గురువారం సుమారు 2,400 పాయింట్లకు పైగా కుప్పకూలిన సెన్సెక్స్, నేడు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఉదయం 9.30 నిమిషాలకు సెన్సెక్స్ 760 పాయింట్లు లాభపడి 74,997 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 251 పాయింట్లకు పెరిగి 23,253 వద్ద కొనసాగుతోంది.

ఇక డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 93 వద్ద ఆల్టైమ్ కనిష్టానికి చేరింది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తుండటంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 106 డాలర్లకు పడిపోయింది.

మంగళూరు రిఫైనరీ (MRPL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL), కెనరా బ్యాంక్, కియోక్ట్ (KIOCL) షేర్లు లాభాల్లో ఉన్నాయి. అదేవిధంగా హెచ్ఎఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) వరుసగా రెండో రోజు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. నేటి నుంచి కోల్ ఇండియా అనుబంధ సంస్థ CMPDI ఐపీవో సబ్స్క్రిప్షన్ ప్రారంభమైంది. దీనిపై గ్రే మార్కెట్లో సానుకూల స్పందన కనిపిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande