శత్రువుల కళ్లు బైర్లుకమ్మే దెబ్బ కొట్టాం: సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేని
ఢిల్లీ, 21 మార్చి (హి.స.) పశ్చిమాసియా (West Asia)లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేని (Mojtaba Khamenei) శత్రువులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ కొత్త సంవత్సరం ‘నౌరోజ్’ వేడుకల సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఆయ
we-have-dealt-a-blow-that-will-blind-the-enemies-eyes-i


ఢిల్లీ, 21 మార్చి (హి.స.)

పశ్చిమాసియా (West Asia)లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేని (Mojtaba Khamenei) శత్రువులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ కొత్త సంవత్సరం ‘నౌరోజ్’ వేడుకల సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందేశాన్ని ఇరాన్ అధికారిక మీడియా ప్రసారం చేసింది. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్ శత్రువులు పూర్తిగా ఓడిపోయారని ఆయన ప్రకటించారు.

ఇరాన్ అగ్రశ్రేణి నాయకులను (Top Leaders) హతమార్చడం వల్ల దేశాన్ని లొంగదీసుకోవచ్చని శత్రువులు భావించారని, కానీ అది వారి ఘోర తప్పిదమని పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వాన్ని కూలదోయొచ్చని శత్రువులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, ఇప్పుడు ఆ విషయం వారికి కూడా అర్థమైందని వ్యాఖ్యానించారు. శత్రువుల కళ్లు బైర్లుకమ్మేలా మేము దెబ్బ కొట్టామని ప్రకటించారు. ఇరాన్ ప్రజల మధ్య ఉన్న అచంచలమైన ఐకమత్యమే దేశాన్ని కాపాడిందని, ఏ శక్తీ తమను విడదీయలేదని మొజ్తబా ఖమేని కొనియాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande