
హైదరాబాద్, 25 మార్చి (హి.స.)
దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన తొలి
చాలా చిత్రంతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో 'రాజు వెడ్స్ రాంబాయి' దర్శకుడు సాయిలు ఒకరు. ఈ చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్విని రావు హీరో హీరోయిన్లుగా నటించగా, వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి ఎర్మాతలుగా వ్యవహరించారు. తక్కువ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా గత సంవత్సరం నవంబర్లో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.17 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి భారీ విజయాన్ని అందుకుంది. దీంతో దర్శకుడు సాయిలుపై ఇండస్ట్రీ వర్గాల దృష్టి పడింది.
అలాగే ఆయన తదుపరి చిత్రం ఎవరితో ఉంటుందనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో పెరిగింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, సాయిలు రెండో సినిమా ఇప్పటికే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత ఆసియన్ సునీల్ నారంగ్ సోదరుడు భరత్ నారంగ్, రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా ఈవెంట్ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ, తాను గ్రామీణ నేపథ్యంలో కథలను తెరకెక్కించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. దీంతో ఆయన తదుపరి సినిమా కూడా గ్రామీణ బ్యాక్ డ్రాప్లోనే ఉండే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు