నటుడు బాలకృష్ణకి మరో అరుదైన పురస్కారం.
హైదరాబాద్, 26 మార్చి (హి.స.) టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కు మరో అరుదైన గౌరవం దక్కింది. భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన బాలయ్యకు ప్రతిష్టాత్మక ''లైఫ్తమ్ అచీవ్మెంట్'' (జీవితకాల సాఫల
Balakrishna


హైదరాబాద్, 26 మార్చి (హి.స.)

టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కు మరో అరుదైన గౌరవం దక్కింది. భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన బాలయ్యకు ప్రతిష్టాత్మక 'లైఫ్తమ్ అచీవ్మెంట్' (జీవితకాల సాఫల్య) పురస్కారం లభించింది.

బుధవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలోని 'భారత్ మండపం'లో ఘనంగా ప్రారంభమైన 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ (IFFD) 2026' వేడుకల్లో ఆయనకు ఈ అవార్డును అందజేశారు. దశాబ్దాలుగా సినిమా రంగానికి ఆయన చేసిన విశేష కృషిని గుర్తిస్తూ నిర్వాహకులు ఈ గౌరవాన్ని కల్పించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Chief Minister Rekha Gupta) చేతుల మీదుగా బాలకృష్ణ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ వేడుకలో ఆయనతో పాటు అలనాటి ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్, దివంగత లెజెండరీ నటుడు ధర్మేంద్ర (ఆయన తరఫున కుటుంబ సభ్యులు) కూడా లైఫ్ఎమ్ అచీవ్మెంట్ అవార్డులను అందుకున్నారు. మార్చి 31 వరకు కొనసాగనున్న ఈ చలనచిత్ర ఉత్సవాల్లో వివిధ భాషా చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కపిల్ మిశ్రా, పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మతో పాటు నటీమణులు హేమమాలిని, కంగనా రనౌత్ తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande