పసిడి ప్రియులకు బ్యాడ్న్యూస్.. జస్ట్ 4గంటల్లోనే భారీగా పెరిగిన ధరలు! తులం ఎంతంటే
ముంబై, 26 మార్చి (హి.స.) కొనుగోలు దారులకు బంగారం మరోసారి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే గత రెండు మూడు వారాల్లో ఎవరూ ఊహించని విధంగా 43 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసి మరీ భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు గురువారం మళ్లీ పుంజుకున్నాయి. తాజాగా పెరిగి
Gold


ముంబై, 26 మార్చి (హి.స.)

కొనుగోలు దారులకు బంగారం మరోసారి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే గత రెండు మూడు వారాల్లో ఎవరూ ఊహించని విధంగా 43 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసి మరీ భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు గురువారం మళ్లీ పుంజుకున్నాయి. తాజాగా పెరిగిన ధరల తర్వాత హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

పసిడి ప్రియులకు ఇదో బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గురువారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలోనే 24 క్యారెట్ల 10 గ్రామలు బంగారంపై రూ.220 పెరిగింది. కాగా ఉదయం రూ.1,46,680గా ఉన్న తులం బంగారం ధర ప్రస్తుతం 1,46,890 వద్ద కొనసాగుతోంది.

భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,490గా ఉండగా ఉదయం 6గంటలకు ఈ ధర రూ.1,46,680 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విషయానికి వస్తే ధర రూ.1,34, 650 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి ధర రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది.

అలాగే ఆంధ్రప్రదేశ్లోని విశాఖ పట్నం, విజయవాడ సహా బెంగళూరు, ముంబై, పూణెలో సైతం ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఈ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,490గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34, 650 వద్ద కొనసాగుతుంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,040 వద్ద కొనసాగుతుండగా ఉదయం ఈ ధర ర రూ.1,46,830గా ఉంది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం రూ.1,34,800 వద్ద కొనసాగుతుంది. ఇక చెన్నైలో తులం బంగారం ధర రూ.1,49,130గా ఉంది.

ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. బుధవారం ఒక్క రోజే కేజీ బంగారంపై ఏకంగా రూ.15 వేల వరకు పెరిగింది. ఇక గురువారం జాతీయ మార్కెట్లో కేజీ బంగారం ధర రూ. 2,50,000 వద్ద కొనసాగుతుంది. అయితే బంగారం, వెండి ధరలు ఎప్పికప్పుడూ మారుతూ ఉంటాయి. కాబట్టి తాజా రేట్ల కోసం మీ దగ్గర్లోని గోల్డ్ షాప్లను సందర్శించండి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande