రెండు విడతల్లో 5 లక్షల ఇండక్షన్.స్టవ్ ల సరఫరా
అమరావతి, 27 మార్చి (హి.స.) దిల్లీ: రెండు విడతల్లో 5 లక్షల ఇండక్షన్ స్టవ్ల సరఫరా కోసం కొత్తగా టెండర్లు పిలిచే యోచనలో ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో, వంటగ్య
రెండు విడతల్లో 5 లక్షల ఇండక్షన్.స్టవ్ ల సరఫరా


అమరావతి, 27 మార్చి (హి.స.)

దిల్లీ: రెండు విడతల్లో 5 లక్షల ఇండక్షన్ స్టవ్ల సరఫరా కోసం కొత్తగా టెండర్లు పిలిచే యోచనలో ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో, వంటగ్యాస్ (ఎల్పీజీ) సరఫరాపై ప్రభావం పడటంతో విద]్యుత్తు సాయంతో వంట చేసుకునే ఉపకరణాలకు గిరాకీ పెరిగింది. గిరాకీకి తగ్గట్లుగా సరఫరా పెంచేందుకు ఇటీవలే లక్ష ఇండక్షన్ స్టవ్లకు టెండర్ ప్రక్రియను ఈఈఎస్ఎల్ పూర్తి చేసింది. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు, వినియోగదారుల అభిప్రాయాలు సేకరించి, ఇండక్షన్ ఆధారిత వంట సామగ్రికీ టెండర్ ప్రక్రియను నిర్వహించింది.‘ప్రస్తుతం మార్కెట్లో వినియోగదార్ల నుంచి వస్తున్న అధిక స్పందనను దృష్టిలో ఉంచుకుని, దాదాపు 5 లక్షల ఇండక్షన్ స్టవ్లకు కొత్తగా టెండర్లు ఆహ్వానించాలని ఈఈఎస్ఎల్ భావిస్తోంద’ని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande