
హైదరాబాద్, 27 మార్చి (హి.స.)
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో
ప్రకటన చేశారు. ఇరాన్ ఎనర్జీ ప్లాంట్లపై దాడులను మరో పది రోజులు ఆపుతున్నట్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ప్రభుత్వ కోరిక మేరకు ఏప్రిల్ ఆరవ తేదీ రాత్రి 8 గంటల వరకు ఈ గడువు పొడిగించినట్లు వివరించారు. ఇరాన్ తో జరుగుతున్న చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని క్లారిటీ ఇచ్చారు.
ఫేక్ న్యూస్ ఎవరు కూడా నమ్మకూడదని కోరారు డొనాల్డ్ ట్రంప్. ఇరానియన్లు చర్చల్లో మేటి అని ట్రంప్ ప్రశంసించారు. యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా చేసిన ఈ ప్రకటన అందరికీ రిలీఫ్ ఇచ్చింది. ఇక అటు ట్రంప్ ను ఏ మాత్రం నమ్మకూడదని, సైనికులు అలర్ట్ గా ఉండాలని ఇరాన్ చెబుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..