బంగారం, వెండి ధరలు పరుగులే.. పరుగులు!
ముంబై, 27 మార్చి (హి.స.)మళ్లీ బంగారం, వెండి ధరలకు రెక్కలొస్తున్నాయి. గత రెండు రోజుల వరకు భారీగా తగ్గిన ధరలు.. రెండు రోజులుగా మళ్లీ పరుగులు పెడుతోంది. తాజాగా ప్రస్తుతం మార్చి 27న తులం బంగారం ధర రూ.1,44,540 ఉంది. మార్కెట్లో మళ్లీ ఊపందుకున్న పసిడి ధర
Gold


ముంబై, 27 మార్చి (హి.స.)మళ్లీ బంగారం, వెండి ధరలకు రెక్కలొస్తున్నాయి. గత రెండు రోజుల వరకు భారీగా తగ్గిన ధరలు.. రెండు రోజులుగా మళ్లీ పరుగులు పెడుతోంది. తాజాగా ప్రస్తుతం మార్చి 27న తులం బంగారం ధర రూ.1,44,540 ఉంది.

మార్కెట్లో మళ్లీ ఊపందుకున్న పసిడి ధరలు.. నిన్న రూ.2వేల వరకూ పెరిగింది. పోనీలే ధరలు తగ్గుతున్నాయని మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు సంబరపడితే ఒక్కసారిగా ఆశలు ఆవిరయ్యాయి. దీంతో పాటు కంగారు కూడా మొదలైంది. ధరలు ఈసారి ఏ స్థాయికి చేరతాయని ఆందోళన చెందుతున్నారు. అటు ఇరాన్, ఇజ్రాయెల్ వార్, ఇటు ముడిచమురు కష్టాలు, పెట్రోల్ పెంట, అటు లాక్డౌన్ ప్రచారంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏ క్షణం ఏ సమస్య వచ్చి పడుతుందో అని ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయంగా గానీ, మార్కెట్ పరంగా గానీ..ఎక్కడ ఏం జరిగినా ఆ ఎఫెక్ట్ మధ్యతరగతి ప్రజలపై పడుతోంది.

ప్రధాన నగరాల్లో ధరలు:

హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,540 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,490 వద్ద ట్రేడవుతోంది.

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,540 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,490 వద్ద ట్రేడవుతోంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,690 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,640 వద్ద ట్రేడవుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,540 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,490 వద్ద ట్రేడవుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande