జపాన్ బాస్ కు ఐకాన్ స్టార్ స్పెషల్ గిఫ్ట్..
హైదరాబాద్, 28 మార్చి (హి.స.) సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాదు, భారతీయ వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంలో కూడా తాను ఐకాన్ అని అల్లు అర్జున్ మరోసారి నిరూపించుకున్నారు. తాజాగా, జపాన్కు చెందిన గీక్ పిక్చర్స్ సీఈఓ టొమాట్స
అల్లు అర్జున్


హైదరాబాద్, 28 మార్చి (హి.స.)

సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాదు, భారతీయ వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంలో కూడా తాను ఐకాన్ అని అల్లు అర్జున్ మరోసారి నిరూపించుకున్నారు. తాజాగా, జపాన్కు చెందిన గీక్ పిక్చర్స్ సీఈఓ టొమాట్సు కొసానోతో జరిగిన సమావేశంలో, బన్నీ కేవలం గెస్ట్ గా వెళ్లడమే కాకుండా మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఒక అద్భుతమైన కానుకను అందజేశారు. ఈ సమావేశంలో అల్లు అర్జున్ అత్యంత పవిత్రమైన 'సీతా-రామ కల్యాణం' పెయింటింగ్ను కొసానోకు బహుమతిగా ఇచ్చారు. రామాయణంలోని ఈ ఘట్టం పవిత్రతకు, ధర్మానికి, అనంతమైన ప్రేమకు నిదర్శనం. కేవలం బహుమతి ఇచ్చి వదిలేయకుండా, ఆ పెయింటింగ్ వెనుక ఉన్న లోతైన అర్థాన్ని, రామాయణం నేర్పే విలువలను బన్నీ స్వయంగా వివరించారు. ధర్మం, త్యాగం, భక్తి వంటి అంశాలు సరిహద్దులు దాటి మనుషులను ఎలా కలుపుతాయో ఆయన చెప్పిన తీరుకు జపాన్ సీఈఓ మంత్రముగ్ధులయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande