సౌదీ ఎయిర్బేస్పై ఇరాన్ భీకర దాడి.. 10 మంది అమెరికా సైనికులకు గాయాలు
రియాద్, 28 మార్చి (హి.స.) సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్పై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ తాజా దాడితో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరాయి. ఈ దాడిలో 10 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు.
/iran-launches-missile-attack-on-saudi-airbase-injures-10-us-soldiers


రియాద్, 28 మార్చి (హి.స.) సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్పై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ తాజా దాడితో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరాయి. ఈ దాడిలో 10 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన ఎనిమిది మందికి తీవ్ర గాయాలైనట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన పలు కీలకమైన రీఫ్యూయలింగ్ విమానాలతో పాటు ఒక నిఘా విమానం దెబ్బతిన్నట్లు సమాచారం.

రాజధాని రియాద్ను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించిన మరో బాలిస్టిక్ క్షిపణిని గాల్లోనే అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ రక్షణ శాఖ స్పష్టం చేసింది. కాగా, ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఈ ఘర్షణలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన దాడుల్లో మొత్తం 13 మంది అమెరికా సైనికులు మృతి చెందగా, 300 మందికి పైగా గాయపడినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అలాగే అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. యుద్ధం కారణంగా ఇప్పటి వరకు 1937 మంది మృతి చెందినట్లు ఇరాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande