బంగ్లాదేశ్లో పెను విషాదం: పద్మా నదిలో మునిగిన బస్సు.. 23 కు చేరిన మృతుల సంఖ్య
న్యూఢిల్లీ, 26 మార్చి (హి.స.) ప్రయాణికులతో వెళ్తున్న బస్సుఅదుపుతప్పి పద్మా నది (Padma river)లో పడిపోయిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. బంగ్లాదేశ్లోని రాజ్బరి జిల్లా దౌలత్అయా ఫెర్రీ టెర్మినల్ వద్ద బుధవారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాద
Bus accident


న్యూఢిల్లీ, 26 మార్చి (హి.స.)

ప్రయాణికులతో వెళ్తున్న బస్సుఅదుపుతప్పి పద్మా నది (Padma river)లో పడిపోయిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. బంగ్లాదేశ్లోని రాజ్బరి జిల్లా దౌలత్అయా ఫెర్రీ టెర్మినల్ వద్ద బుధవారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. రాజ్బరి నుండి ఢాకా వెళ్తున్న ఒక ప్రయాణికులతో కూడిన బస్సు, ఫెర్రీ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు పద్మా నదిలో పడిపోయింది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 23 కు చేరుకుంది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు.

తీవ్రమైన సుమారు 50 మంది ప్రయాణికులతో ఉన్న ఈ బస్సు, ఫెర్రీ ప్లాట్ఫారమ్ (పాంటూన్) మీద నిలబడి ఉన్న సమయంలో 'హస్నా హెనా' అనే చిన్న పడవ వేగంగా వచ్చి ప్లాట్ఫారమ్ను ఢీకొట్టింది. కుదుపునకు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం తో బస్సు నేరుగా 80 అడుగుల లోతున్న నదిలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ఫైర్ సర్వీస్, నౌకాదళం, స్థానిక పోలీసులు భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. 'హంజా' అనే రెస్క్యూ షిప్ సహాయంతో సుమారు ఆరు గంటల శ్రమ అనంతరం నదిలో మునిగిపోయిన బస్సును బయటకు తీశారు.

బస్సు లోపల చిక్కుకుపోయిన వారి మృతదేహాలను వెలికితీస్తుండటంతో తీరం వెంబడి ఉన్న బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈద్ సెలవుల అనంతరం తమ కుటుంబాలతో కలిసి తిరిగి పనుల్లోకి వెళ్తున్న వారే ఈ ప్రమాదంలో ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 11 మంది ప్రయాణికులు అతికష్టంమీద ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడగా, మరికొంతమంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.ఘటనపై బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి తారిఖ్ రెహమాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, విచారణకు ఆదేశించారు. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande