మళ్లీ పుంజుకుంటున్న బంగారం ధర.. వెండి మాత్రం తగ్గింది!
ముంబై, 28 మార్చి (హి.స.)బంగారం ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం దీనికి ప్రధాన కారణం. తాజాగా మార్చి 28వ తేదీన దేశంలో
Gold


ముంబై, 28 మార్చి (హి.స.)బంగారం ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం దీనికి ప్రధాన కారణం. తాజాగా మార్చి 28వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు పుంచుకున్నాయి. ఇటీవల నుంచి బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో దిగి వచ్చాయ. రికార్డు స్థాయిలో తగ్గుతూ అందరిని ఆశ్చర్యపరిచాయి. ఇక వైపు యుద్దం కొనసాగుతుంటే మరో వైపు బంగారం ధరలు దిగి రావడం మహిళలకు ఉపశమనం కలిగిస్తున్నాయనే చెప్పాలి. కానీ రెండు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు

నగరం 22 క్యారెట్లు 24 క్యారెట్లు )

హైదరాబాద్ రూ. 1,32,660 రూ. 1,44,720

విజయవాడ రూ 1,32,660 రూ. 1,44,720

ఢిల్లీ రూ. 1,32,810 రూ.1,44,870

ముంబై రూ. 1,32,660 రూ. 1,44,720

ధర పెరుగుదల:

నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారంపై సుమారు రూ.160 వరకు పెరుగుదల కనిపించింది.

అంతర్జాతీయ ప్రభావం:

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఒక ఔన్స్కుకు సుమారు $ 4,430 వద్ద ట్రేడ్ అవుతోంది.

వెండి ధర:

బంగారం బాటలోనే వెండి కూడా నడుస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర సుమారు రూ. 2,39,900 వద్ద కొనసాగుతోంది.

అదే హైదరాబాద్; కేరళ, చెన్నైలలో కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద ట్రేడవుతుంది.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande