కృష్ణా జిల్లాలో.దారుణం చోటుచేసుకుంది
అమరావతి, 29 మార్చి (హి.స.) నందివాడ: కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నందివాడ మండలం పెదలింగాలలో పదేళ్ల బాలుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నానమ్మ లక్ష్మి (70)తో కలిసి బాలుడు బాలాజీ ఇంట్లో నిద్రిస్త
కృష్ణా జిల్లాలో.దారుణం చోటుచేసుకుంది


అమరావతి, 29 మార్చి (హి.స.)

నందివాడ: కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నందివాడ మండలం పెదలింగాలలో పదేళ్ల బాలుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నానమ్మ లక్ష్మి (70)తో కలిసి బాలుడు బాలాజీ ఇంట్లో నిద్రిస్తుండగా దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో బాలాజీ మృతిచెందగా.. వృద్ధురాలు లక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. ఆమె విజయవాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉంది. నందివాడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. సిమెంట్ రాళ్లతో ఇరువురినీ బలంగా కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడు, వృద్ధురాలిపై దాడికి గల కారణాలు తెలియరాలేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande