
హైదరాబాద్, 29 మార్చి (హి.స.)
తెలంగాణ రాజకీయంలో నేడు మైనింగ్ మంటలు రేగాయి. అసెంబ్లీ వేదికగా ఆదివారం మైనింగ్, ఇసుక అక్రమ రావాణాపై అధికార, విపక్షాల మధ్య రచ్చ పీక్స్ కు చేరింది. ఈ క్రమంలో శాసనసభలో ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగగా కేటీఆర్ పై ఎమ్యెల్యే దానం నాగేందర్ (Danam Nagender) సంచలన ఆరోపణలు చేశారు.
బీఆర్ఎస్ హాయంలో వేల ఎకరాల భూ కుంభకోణం జరిగిందని దానం ఆరోపించారు. అంతే కాదు మా సొంత భూమిని సైతం కేటీఆర్ (KTR) వదల్లేదని ఆయన చేసిన పనికి మా బాధ ఎవరికి చెప్పుకోలేక ఆ రోజు నోరు మూసుకు కూర్చున్నామని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నా తండ్రి కష్టార్జితమైన మా సొంత భూమిని కేటీఆర్ ఓ ప్రైవేట్ కంపెనికీ అప్పగించారని హైదరాబాద్లో పుట్టి పెరిగిన మేము మౌనంగా ఉండిపోవాల్సిన దయనీయమైన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయంలో తన వద్ద ఆధారాలు ఉన్నాయని కావాలంటే రికార్డులు చూయిస్తానన్నారు. మేమెంత నష్టపోయామో మాకు తెలుసు. మా బాధలు ఎవరికి చెప్పుకోలేకపోయామన్నారు. ఈ భూకుంభకోణాలపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..