
తిరుమల, 29 మార్చి (హి.స.)
: తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ట్రస్టులకు రూ. 2 కోట్ల విరాళం అందింది. విశాఖకు చెందిన దేవీ ఫిషరీస్ సంస్థ ఆదివారం తితిదే శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1,01,25,000లను విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్లు ఇంద్రనీల్ చిట్టూరి, మహేంద్ర యార్లగడ్డ తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ శ్రీ రామకృష్ణకు విరాళం డీడీని అందజేశారు. అదేవిధంగా బెంగళూరుకు చెందిన బిల్వ ఇన్ఫ్రా సంస్థ తితిదే బర్డ్ ట్రస్టుకు రూ.కోటి విరాళం ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ ప్రవీణ్ ఎస్.నాయర్ తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ శ్రీ రామకృష్ణకు విరాళం డీడీని అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ