ఆదిలాబాద్ నాగార్జునసాగర్ లో.విమానాశ్రయాలు
అమరావతి, 29 మార్చి (హి.స.) , దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్గం గతవారం ఆమోదించిన ఉడాన్ 2.0 ద్వారా తెలుగు రాష్ట్రాలకు విస్తృత ప్రయోజనాలు కలగనున్నాయని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు. ఈ పథకం కి
ఆదిలాబాద్ నాగార్జునసాగర్ లో.విమానాశ్రయాలు


అమరావతి, 29 మార్చి (హి.స.)

, దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్గం గతవారం ఆమోదించిన ఉడాన్ 2.0 ద్వారా తెలుగు రాష్ట్రాలకు విస్తృత ప్రయోజనాలు కలగనున్నాయని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటికే ఉన్న ఎయిర్స్ట్రిప్లను విమానాశ్రయాలుగా అభివృద్ధి చేసే వీలున్నందున తెలంగాణలోని ఆదిలాబాద్, ఆంధ్రప్రదేశ్లోని నాగార్జునసాగర్లలో కొత్త విమానాశ్రయాలు నిర్మించేందుకు వీలుంటుందని చెప్పారు. కర్నూలు, కడప విమానాశ్రయాల నుంచి దిల్లీ, ఇతర నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభించడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని వెల్లడించారు. దిల్లీ సమీపంలోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించిన సందర్భంగా ఆయన శనివారం రాత్రి తన నివాసంలో విలేకర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ అధీనంలో ఉన్న ఆదిలాబాద్ ఎయిర్ఫోర్స్ ఎయిర్స్ట్రిప్ను మేం స్వాధీనం చేసుకోబోం. మిగిలిన భూమి సేకరించి అందులో ఎయిర్పోర్టు నిర్మిస్తాం. బేగంపేట ఎయిర్పోర్టు రన్వే కింద ట్రాఫిక్ టన్నెల్కు అనుమతివ్వడానికి అభ్యంతరం లేదు. అందుకు అవసరమైన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే మేం అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఉడాన్ 2.0 కింద కేటాయించిన రూ.28 వేల కోట్లలో రూ.12 వేల కోట్లు 100 ఎయిర్పోర్టుల అభివృద్ధికి వినియోగిస్తాం. 200 హెలిపోర్టుల నిర్మాణానికి రూ.3,500 కోట్లు ఖర్చు చేయనున్నాం. మరో రూ.10వేల కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద విమానయాన సంస్థలకు ఇవ్వనున్నాం. ఆంధ్రప్రదేశ్లో భోగాపురం కొత్త విమానాశ్రయం, విజయవాడలో విస్తరించిన విమానాశ్రయం రెండూ జూన్కల్లా అందుబాటులోకి వస్తాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande