
న్యూఢిల్లీ, 29 మార్చి (హి.స.)
మన్ కీ బాత్ 132 వ ఎపిసోడ్ లో భాగంగా ప్రధాని మోడీ క్రీడా విప్లవం నుంచి ప్రపంచ సంక్షోభం వరకు పలు కీలక అంశాలపై సందేశం ఇచ్చారు.
జమ్మూ కాశ్మీర్ ప్రజలకు క్రీడల పట్ల ఎప్పుడు అమితమైన ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాంతం పెద్ద క్రీడా ఈవెంట్లకు కేంద్రంగా మారుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. 'ఖేలో ఇండియా వింటర్ గేమ్స్' ద్వారా గుల్మార్గ్ ఇప్పటికే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడి యువతలో ఫుట్బాల్ వంటి క్రీడలు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. రానున్న రోజుల్లో కూడా జమ్మూ కాశ్మీర్ విజయ పరంపర ఇలాగే కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఆశిస్తున్నానని ప్రధాని చెప్పుకొచ్చారు.
నేను తరచూ చెబుతుంటాను ఎవరు ఆడతారో వారే అభివృద్ధి చెందుతారు(Jo Khelega, Wo Khilega). దేశ యువత గతంలో ప్రాచుర్యం లేని క్రీడలను కూడా ఇప్పుడు ఎంచుకోవడం చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది. 'అస్మిత అథ్లెటిక్స్ లీగ్' గురించి కూడా నాకు సమాచారం అందింది. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీని కింద అనేక క్రీడా పోటీలు నిర్వహించారు. దేశంలో జరుగుతున్న ఈ క్రీడా పరివర్తనలో భారతీయ మహిళలు కీలక పాత్ర పోషించడం చూడటం చాలా బాగుందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.
గత నెల చివరలో కర్ణాటకలోని హుబ్బళ్ళిలో ఒక ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది. అందులో జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు 'రంజీ ట్రోఫీ'ని గెలుచుకుంది. అత్యంత సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఏడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఈ జట్టు తన మొదటి రంజీ ట్రోఫీ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ అపూర్వ విజయం ఆటగాళ్ల ఏళ్ల తరబడి నిరంతర కృషి ఫలితం. టీమ్ కెప్టెన్ పారస్ డోగ్రా అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. రంజీ సీజన్లో 60 వికెట్లు తీసిన యువ కాశ్మీరీ బౌలర్ ఆకిబ్ నబీ ప్రదర్శన గురించి కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ విజయం అక్కడ మరికొంత మంది యువతను క్రీడల వైపు మళ్లేలా స్ఫూర్తినిస్తుందన్నారు.
ఈ మార్చి నెల దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. టీ20 ప్రపంచకప్లో భారత్ సాధించిన చారిత్రక విజయం దేశమంతటా ఆనందాన్ని నింపింది. మన జట్టు
సాధించిన ఈ అసాధారణ విజయాన్ని చూసి మనమందరం గర్విస్తున్నాం.
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కులు ఉన్న దేశం. దేశ యువశక్తిని దేశ నిర్మాణానికి వినియోగించినప్పుడు, అది అపారమైన మద్దతును ఇస్తుంది. ఈ దేశ నిర్మాణ బాధ్యతను నెరవేర్చడంలో 'మేరా యువ భారత్' (My Bharat) సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సంస్థ దేశ యువతను వివిధ సానుకూల పరిణామాలతో అనుసంధానం చేస్తుంది.
దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ప్రజా భాగస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించే 'జ్ఞాన భారతం సర్వే' గురించి నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఇది మన గొప్ప సంస్కృతి మరియు వారసత్వానికి సంబంధించినది. దేశవ్యాప్తంగా ఉన్న పురాతన రాతప్రతుల (Manuscripts) సమాచారాన్ని సేకరించడమే దీని లక్ష్యం. మీరు 'జ్ఞాన భారతం యాప్' ద్వారా ఈ సర్వేలో చేరవచ్చు. మీ వద్ద ఏదైనా రాతప్రతి ఉన్నా లేదా దాని గురించి సమాచారం ఉన్నా ఆ ఫోటోను యాప్లో షేర్ చేయండి. ప్రతి ఎంట్రీని రికార్డ్ చేసే ముందు ధృవీకరించడం జరుగుతుంది.
యుద్ధం కారణంగా ఏర్పడిన పలు నిత్యావసరాల కొరత అంశాన్ని రాజకీయం చేస్తున్న వారందరూ అలా చేయకూడదని నేను కోరుతున్నాను. ఇది 140 కోట్ల మంది ప్రయోజనాలకు సంబంధించిన విషయం. ఇందులో స్వార్థ రాజకీయాలకు చోటు లేదు. వదంతులు వ్యాప్తి చేసేవారు దేశానికి గొప్ప హాని చేస్తున్నారు. పుకార్లను నమ్మి తప్పుదోవ పట్టవద్దని దేశప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం నిరంతరం సమాచారాన్ని అందిస్తుంది, దానిని మాత్రమే నమ్మండని సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు.
అంతర్జాతీయ సంబంధాలు, గత దశాబ్ద కాలంలో మనం నిర్మించుకున్న సామర్థ్యం కారణంగానే భారత్ ఈ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలుగుతోంది. ఇది నిశ్చయంగా సవాళ్లతో కూడిన సమయం. దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండి ఈ సవాలును అధిగమించాలని 'మన్ కీ బాత్' ద్వారా మరోసారి కోరుతున్నానని ప్రధాని అన్నారు.
యుద్ధం కారణంగా ప్రస్తుతం మన పొరుగు ప్రాంతాల్లో గత నెల రోజులుగా తీవ్రమైన యుద్ధం జరుగుతోంది. గల్ఫ్ ప్రాంతాల్లో పనిచేస్తున్న లక్షలాది భారతీయుల కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. అక్కడ ఉన్న కోటి మందికి పైగా భారతీయులకు అన్ని విధాలా సహకారం అందిస్తున్న గల్ఫ్ దేశాలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. యుద్ధం జరుగుతున్న ప్రాంతం మన ఇంధన అవసరాలకు ప్రధాన కేంద్రం. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సంక్షోభం ఏర్పడుతోంది.
ఈ మార్చి నెల అంతర్జాతీయ స్థాయిలో అనేక పరిణామాలకు వేదికైంది. కోవిడ్ సంక్షోభం తర్వాత ప్రపంచం పురోగతి వైపు సాగుతుందని మనమందరం భావించాము, కానీ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో యుద్ధాలు, సంఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయని ప్రధాని మోడీ తన మన్ కీ బాత్ 132వ ఎపిసోడ్ లో చెప్పుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..