ఇరాన్ తో యుద్ధం తీవ్రం.. పశ్చిమాసియాలో 3,500 మంది మెరైన్లను మోహరించిన అమెరికా
న్యూఢిల్లీ, 29 మార్చి (హి.స.) ఇరాన్ (Iran) తో యుద్ధ వాతావరణం తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా (USA) కీలక చర్యలు చేపట్టింది. పశ్చిమాసియాలో తన సైనిక శక్తిని గణనీయంగా పెంచుతూ 3,500 మంది మెరైన్లు నావికులతో కూడిన ఓ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను మోహరించింది. ఈ
War


న్యూఢిల్లీ, 29 మార్చి (హి.స.) ఇరాన్ (Iran) తో యుద్ధ వాతావరణం తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా (USA) కీలక చర్యలు చేపట్టింది. పశ్చిమాసియాలో తన సైనిక శక్తిని గణనీయంగా పెంచుతూ 3,500 మంది మెరైన్లు నావికులతో కూడిన ఓ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను మోహరించింది. ఈ బలగాలు మార్చి 27న మధ్యప్రాచ్యానికి చేరాయని, అమెరికా సెంట్రల్ కమాండ్ (US Centrel Command) ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.

యూఎస్ఎస్ ట్రిపోలీ యుద్ధనౌకపై ఈ బలగాలు వచ్చాయని వెల్లడించింది. ఈ బృందంలో దాదాపు 3,500 మంది సైనికులతోపాటు, రవాణా, ఫైటర్ విమానాలు, దాడులకు అవసరమైన ఇతర యుద్ధ సామాగ్రి కూడా ఉన్నాయి. సముద్రం నుంచి నేలపై నుంచి ఏకకాలంలో దాడులు చేయగల సామర్థ్యం ఈ బలగాలకు ఉంది. వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం, పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, తీరప్రాంత లక్ష్యాలపై దాడులు చేయడం వంటి వేగవంతమైన ఆపరేషన్ల కోసం ఈ తరహా యూనిట్లను ఉపయోగిస్తారు.

ఇదిలావుండగా మధ్యప్రాచ్యానికి మరో 10 వేల మంది సైనికులను పంపే ప్రతిపాదనను పెంటగాన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. దౌత్య మార్గాలతో పాటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరిన్ని సైనిక ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉంచడమే దీని లక్ష్యమని తెలుస్తోంది. ఈ బలగాలను ఇరాన్కు సమీపంలో, ముఖ్యంగా ఆ దేశానికి కీలకమైన చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపంపై దాడికి వీలుగా ఉండే ప్రాంతాల్లో మోహరించే అవకాశం ఉందని రక్షణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande