రామచంద్రాపురం ప్రభుత్వ కళాశాల ఎదుట.కారులో మంటలు
రామచంద్రపురం: , 29 మార్చి (హి.స.) పట్టణం ప్రధానరోడ్డులోని కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట శనివారం రోడ్డుపై నిలిపిన కారులోంచి మంటలు రేగాయి. దట్టమైన పొగతో మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సకాలం
రామచంద్రాపురం ప్రభుత్వ కళాశాల ఎదుట.కారులో మంటలు


రామచంద్రపురం: , 29 మార్చి (హి.స.) పట్టణం ప్రధానరోడ్డులోని కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట శనివారం రోడ్డుపై నిలిపిన కారులోంచి మంటలు రేగాయి. దట్టమైన పొగతో మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బందితో వచ్చి మంటలు అదుపులోకి తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రామచంద్రపురం మండలం చోడవరం నుంచి డాక్టర్ స్టాలిన్ ఆసుపత్రి (కమలా నర్సింగ్ హోమ్)కు చికిత్స నిమిత్తం మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో కారులో బిక్కిన కృష్ణవేణి తన కుమారుడితో కలిసి వచ్చారు.

అప్పటికే కారు నుంచి పొగలు రావడంతో కళాశాల గేటు వద్ద ఆపి వారు దిగిపోయారు. అనంతరం మంటలు పెరిగి సీట్లు, టైర్లు, బ్యాటరీ కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక శాఖ అధికారి కె.వెంకటరెడ్డి, సిబ్బంది రాజబాబు, అర్జన్న, వీరబాబు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారి వెంకటరెడ్డి చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande