తెలుగుదేశం సభ్యులకు 44 వ ఆవిర్భావ సందర్భంగా శుభాకాంక్షలు
అమరావతి, 29 మార్చి (హి.స.) అమరావతి,తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, అభిమానులకు.. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కేవలం ఒక రాజకీయ వేదిక మాత్రమే కాదు.. ఇది కో
తెలుగుదేశం సభ్యులకు 44 వ ఆవిర్భావ సందర్భంగా శుభాకాంక్షలు


అమరావతి, 29 మార్చి (హి.స.)

అమరావతి,తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, అభిమానులకు.. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కేవలం ఒక రాజకీయ వేదిక మాత్రమే కాదు.. ఇది కోట్లాది మంది తెలుగు వారి ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపం. ‘సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు’ అనే నినాదంతో ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లిన తీరు.. భారత రాజకీయాల్లో ఒక అరుదై ఘట్టం. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు.

‘తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. యుగపురుషుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరతరాల తెలుగు వారి ఆకాంక్షలకు ప్రతిరూపం. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వాలనే ఆయన సిద్దాంతాన్ని సదా పాటిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. ఆవిర్భావ దినోత్సవం అంటే మన ఇంటి పండుగ. ఈ పండుగ సందర్భంగా ప్రతి కార్యకర్తకూ పేరుపేరునా శుభాకాంక్షలు తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు.

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు అని నినదించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో పేద ప్రజలకు అండగా నిలిచింది. టీడీపీ ఆవిర్భావం తర్వాతే సమాజంలో అణగారిన, బడుగు, బలహీనవర్గాలకు రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు వచ్చింది. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రపంచంలో తెలుగువారిని నెం.1గా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.’ అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande